గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Jul 30, 2020 , 12:15:55

అల్ల‌రి చేస్తున్న కార‌ణంతో నాలుగేండ్ల కుమార్తెను చంపిన త‌ల్లి

అల్ల‌రి చేస్తున్న కార‌ణంతో నాలుగేండ్ల కుమార్తెను చంపిన త‌ల్లి

పూణే: అల్ల‌రి చేస్తున్నద‌న్న కార‌ణంతో నాలుగేండ్ల కుమార్తెను ఒక త‌ల్లి చంపేసింది. మ‌హారాష్ట్ర‌లోని పూణేలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పింప్రిలోని ‌చిన్చ‌వాడ‌కు చెందిన ఒక మ‌హిళ ఈ నెల 27న అల్ల‌రి చేస్తూ విసిగిస్తున్న నాలుగేండ్ల కుమార్తెను చావ‌బాదింది. ఆగ్ర‌హంతో ఆ పాప త‌ల‌ను గోడ‌కేసి కొట్టింది. ఆపై గొంతు పిసికింది. దీంతో ఆ పాప చ‌నిపోయింది. ఇంటికి వ‌చ్చిన భ‌ర్త‌కు ఈ విషయం చెప్పి బోరున ఏడ్చింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ఆ మ‌హిళ‌ను అరెస్ట్ చేశారు. మ‌రోవైపు పిల్ల‌ల అల్ల‌రిప‌ట్ల త‌ల్లిదండ్రులు అతిగా ఆగ్ర‌హావేశాల‌కు గురైతే ఇలాంటి దారుణాలే జ‌రుగుతాయ‌ని మాన‌సిక నిఫుణులు చెబుతున్నారు. త‌ల్లిదండ్రులు త‌మ ఒత్తిడిని త‌గ్గించుకోవాల‌ని వారు సూచిస్తున్నారు.logo