బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 21, 2020 , 15:22:38

సైకిల్‌పై వెళ్తున్న ఒక వ్యక్తిపై ఎలుగుబంటి దాడి

సైకిల్‌పై వెళ్తున్న ఒక వ్యక్తిపై ఎలుగుబంటి దాడి

భువనేశ్వర్: సైకిల్‌పై వెళ్తున్న ఒక వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లాలోని భవానిపట్న పట్టణంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. సమీప అటవీ ప్రాంతం నుంచి జనవాసంలోకి వచ్చిన ఒక అడవి ఎలుగుబంటి సైకిల్‌పై వెళ్తున్న ఒక వ్యక్తిపై దాడి చేసింది. దీంతో స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. కొందరు దానిని వెంబడించి కర్రలతో కొట్టే ప్రయత్నం చేశారు.


మరోవైపు ఎలుగుబంటి దాడి విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆ ఎలుగుబంటిని పట్టుకున్నారు.  దానిని అడవిలోకి వదిలేస్తామని జిల్లా అటవీ అధికారి నితీష్ కుమార్ తెలిపారు.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo