సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Aug 30, 2020 , 20:06:41

ఏడుపు ఆపడం లేదని రెండేండ్ల చిన్నారి నోటికి టేప్‌ వేసి.. చితకబాదిన నాయనమ్మ

ఏడుపు ఆపడం లేదని రెండేండ్ల చిన్నారి నోటికి టేప్‌ వేసి.. చితకబాదిన నాయనమ్మ

బెంగళూరు : ఏడుపు ఆపడం లేదని రెండేండ్ల చిన్నారిని నాయనమ్మ చితకబాది, విచక్షణా రహితంగా వాతలు పెట్టడంతో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన బెంగళూరులో శుక్రవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు తెలిపిన వివరాలు.. ఇర్ఫాద్‌ అనే వ్యక్తికి నలుగురు కుమారులు కాగా.. తన భార్య, ముగ్గురు కుమారులను తీసుకొని రోజు కూలి పనులకు వెళ్తుండేవాడు. తన రెండేళ్ల నాలుగో కుమారుడిని మాత్రం తన తల్లి వద్ద విడిచి వీరు పనికి వెళ్లేవారు. ఈ క్రమంలో శుక్రవారం బాలుడు తండ్రి కోసం ఏడుస్తుండగా.. నాయనమ్మ ముబాషిరా ఎంత సముదాయించినా వినడం లేదు. దీంతో విసిగి వేసారిన వృద్ధురాలు ఏడుపు ఆపాలని చిన్నారి నోటికి టేప్‌ వేసి విచక్షణా రహితంగా కొట్టింది. బాధతో చిన్నారి ఇంకా ఎక్కువ రోధిస్తుండడంతో కోపోద్రిక్తులైన ముబాషిరా ముఖం, వంటిపై వాతలు పెట్టింది. అంతటితో ఆగకుండా తల మీద పలుమార్లు కొట్టడంతో బాలుడు స్పృహ తప్పాడు.

బాలుడి ఏడుపు విన్న స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు చిన్నారిని ఇందిరా గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చైల్డ్ హెల్త్ దవాఖానకు తరలించారు. చికిత్స ప్రారంభించిన వైద్యులు చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని చర్మం బాగా కాలిపోయిందని తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముబాషిరాను శనివారం అరెస్టు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo