సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jul 16, 2020 , 13:02:25

లారీని ఢీకొట్టిన గూడ్సు రైలు

లారీని ఢీకొట్టిన గూడ్సు రైలు

భువనేశ్వర్: ఒక లారీని గూడ్సు రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ లారీ నుజ్జునుజ్జు అయ్యింది. ఒడిశాలోని పారాదీప్ పోర్టు సమీపంలోని నిషేధిత జేఎస్‌డబ్ల్యూ ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది. పట్టాలమీదుగా వెళ్తున్న లారీని గూడ్సు రైలు ఢీకొట్టింది. దీంతో లారీ మధ్యభాగం విరిగిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్  తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నేపథ్యలంలో గూడ్సు రైలు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. రైల్వే అధికారులు ఘటనా స్థలానికి వచ్చి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


logo