బుధవారం 12 ఆగస్టు 2020
Crime - Jul 12, 2020 , 13:47:18

చోరీ చేసేందుకు వచ్చి బావిలో పడి మృతి చెందిన దొంగ

చోరీ చేసేందుకు వచ్చి బావిలో పడి మృతి చెందిన దొంగ

జనగామ : చోరీ చేసేందుకు వచ్చి దొంగ బావిలో పడిన ఘటన జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రాఘవపూర్‌లోని డబుల్ బెడ్ ఇళ్లలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి వచ్చారు. ఈ ముగ్గురు అనుమానంగా కనబడడంతో వారిలో ఒకరిని పట్టుకొన్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. మిగిలిన ఇద్దరు తప్పించుకొని పారిపోతుండగా ఓ వ్యక్తి జాతీయ రహదారి పక్కన ఉన్న బావిలో పడి మృతి చెందాడు.

గ్రామస్తులు సహకారంతో పోలీసులు బావిలో నుంచి మృతదేహాన్ని బయటికి తీశారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన ఉమర్‌గా గుర్తించారు. సెటాప్ బాక్సుల చోరీ కోసం వచ్చి తప్పించుకు పారిపోయే క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడని పోలీసులు తెలిపారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo