మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 11, 2020 , 17:16:51

కరోనాతో సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ మృతి

కరోనాతో సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ మృతి

హైదరాబాద్ : సీనియర్‌ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్‌ పోలీస్ (డీఎస్పీ) ఒకరు సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ 50 ఏండ్ల డీఎస్పీ 1996లో రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పోలీస్‌ బలగాల్లో చేరారు. ఇప్పుడు మహాబూబాబాద్ జిల్లాలోని సాయుధ రిజర్వ్ విభాగంలో పనిచేస్తున్నట్లు సమాచారం. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తరువాత ఆరోగ్యం క్షీణిస్తుండడంతో ఇటీవల ఆయన్ను నగరంలోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు.

తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబాబాద్‌ ఎస్పీ ఎన్ కోటిరెడ్డి ఆయన మృతికి సంతాపం తెలిపారు. 


logo