శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Jul 20, 2020 , 22:35:39

దంప‌తుల‌ను చంపి.. ఇల్లు త‌గుల‌బెట్టి

దంప‌తుల‌ను చంపి.. ఇల్లు త‌గుల‌బెట్టి

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలో దారుణం జ‌రిగింది. ఓ వ్య‌క్తి ఇంట్లో చొర‌బ‌డి భార్యాభ‌ర్త‌ల‌ను హ‌త్య చేశాడు. అంత‌టితో ఆగ‌క వారి ఇంటిపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. పూరిల్లు కావ‌డంతో ఆ ఇల్లు పూర్తిగా తుగుల‌బ‌డింది. మృత‌దేహాలు కూడా పాక్షికంగా కాలిపోయాయి. ఒడిశా రాష్ట్రం జాజ్‌పూర్ జిల్లా సూరిసాహి గ్రామంలో సోమ‌వారం సాయంత్రం ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. 

హ‌త్య‌కు సంబంధించిన స‌మాచారం అందిన వెంట‌నే స్థానిక పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టానికి త‌ర‌లించి ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌పై స్థానికుల‌ను ఆరా తీశారు. అయితే, ఆ హ‌త్య‌ల‌కుగ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంద‌ని పోలీసులు తెలిపారు. ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ద‌ని, నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జాజ్‌పూర్ జిల్లా ఎస్పీ చ‌ర‌ణ్‌సింగ్ మీనా చెప్పారు.    

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo