బుధవారం 27 జనవరి 2021
Crime - Jan 05, 2021 , 13:45:03

వివాహేత‌ర సంబంధం.. భార్య‌, కుమారుడికి హింస‌

వివాహేత‌ర సంబంధం.. భార్య‌, కుమారుడికి హింస‌

ఖ‌మ్మం : ఓ వ్య‌క్తి మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తూ.. భార్య‌, కుమారుడిని హింసిస్తున్నాడు. కుమారుడి చ‌దువుకు పెట్టుబ‌డి పెట్ట‌కుండా.. ఉన్న ఆస్తుల‌న్నింటినీ మ‌రో మ‌హిళ‌కు క‌ట్ట‌బెట్టాడు. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మం జిల్లాలోని గ‌ట్ట‌య్య సెంట‌ర్‌లో వెలుగు చూసింది. 

వివ‌రాల్లోకి వెళ్తే.. గ‌ట్ట‌య్య సెంట‌ర్‌కు చెందిన రెడ్డి శ్రీనుకు క‌విత‌(కొత్త‌గూడెం, సుజాత న‌గ‌ర్‌)తో 21 ఏళ్ల క్రితం వివాహ‌మైంది. ఈ దంప‌తుల‌కు రెడ్డి ఉద‌య్ విశాల్ అనే కుమారుడు ఉన్నాడు. పెళ్లైన త‌ర్వాత రెండేండ్లు శ్రీను, క‌విత అన్యోన్యంగానే ఉన్నారు. ఆ త‌ర్వాత శ్రీను వ్యాపారం పేరు మీద బ‌య‌ట తిరుగుతూ ఇత‌ర మ‌హిళ‌ల‌తో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్నాడు. గ‌త‌కొంత కాలం నుంచి ఖ‌మ్మం ప‌ట్ట‌ణానికి చెందిన మ‌రో మ‌హిళ‌తో అక్ర‌మ సంబంధం పెట్టుకున్నాడు. ఇద్ద‌రూ క‌లిసి ఇల్లు కిరాయికి తీసుకుని ఉంటున్నారు.

రెడ్ హ్యాండెడ్‌గా..

ఈ క్ర‌మంలో శ్రీను మ‌రో మ‌హిళ‌తో కాపురం పెట్టాడ‌ని విష‌యం తెలియ‌డంతో భార్య క‌విత, కుమారుడి స‌హాయంతో రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుంది. ఆస్తుల‌న్నీ ఆమె పేరు మీద రాయించాడ‌ని, మ‌మ్మ‌ల్ని తీవ్ర చిత్ర‌హింస‌ల‌కు గురి చేస్తున్నాడ‌ని క‌విత ఆవేద‌న వ్య‌క్తం చేసింది. భ‌ర్త‌తో పాటు ఆ మ‌హిళ‌ను ఖ‌మ్మం టూ టౌన్ పోలీసుల‌కు అప్ప‌గించింది. 

ఎంబీబీఎస్ సీటు కోల్పోయిన కుమారుడు

రెడ్డి శ్రీను త‌న కుమారుడిని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో అత‌ను ఎంబీబీఎస్ సీటును కోల్పోయాడు. ఈ ఏడాది రెడ్డి ఉద‌య్ విశాల్‌కు బీ కేట‌గిరి కింద ఎంబీబీఎస్ సీటు వ‌చ్చింది. అయితే స‌రైన స‌మ‌యానికి డ‌బ్బులు చెల్లించ‌క‌పోవ‌డంతో.. సీటు ర‌ద్దు అయిపోయింది. రెడ్డి శ్రీను నిర్వాకం వ‌ల్ల కుమారుడి చ‌దువు మ‌ధ్య‌లో ఆగిపోయింద‌ని క‌విత వాపోయింది.


logo