శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Aug 12, 2020 , 13:26:19

సికింద్రాబాద్‌లో నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

సికింద్రాబాద్‌లో నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌లోని ఓ ప్రయివేటు నర్సింగ్‌ కాలేజీకి చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నిన్న రాత్రి నర్సింగ్‌ కాలేజీ హాస్టల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మత్తు ఇంజెక్షన్‌ తీసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మృతురాలిని నల్లగొండ జిల్లా మాల్‌కు చెందిన సౌందర్యగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


logo