గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Sep 08, 2020 , 17:11:01

‘జై శ్రీ‌రాం’ అన‌నందుకు ముస్లిం డ్రైవ‌ర్ దారుణ హ‌త్య‌

‘జై శ్రీ‌రాం’ అన‌నందుకు ముస్లిం డ్రైవ‌ర్ దారుణ హ‌త్య‌

నోయిడా : జై శ్రీ‌రాం అన‌నందుకు ఓ ముస్లిం డ్రైవ‌ర్‌ను కొంత‌మంది ఆక‌తాయిలు హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాష్ర్టం నోయిడాలోని బాద‌ల్‌పూర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఆదివారం జ‌ర‌గ్గా ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. డ్రైవ‌ర్ కుమారుడి క‌థ‌నం ప్ర‌కారం.. త్రిలోక్‌పురికి చెందిన అఫ్తాబ్ఆలం (46) స్థానికంగా ట్యాక్సీ న‌డుపుకుంటూ జీవ‌నం సాగించేవాడు. ఆదివారం రాత్రి ఓ ప్యాసింజ‌ర్‌ను బులంద్‌షహర్‌లో దించ‌డానికి వెళ్లిన అఫ్తాబ్ కారును కొంత‌మంది మ‌ద్యం సేవించిన ఆక‌తాయిలు ఆపారు. డ్రైవ‌ర్ పేరును అడిగి జై శ్రీ‌రాం అనాల్సిందిగా ఆదేశించారు. 

తాను ఎంత‌కూ ప‌లుక‌న‌ని చెప్ప‌డంతో ఆక‌తాయిలు డ్రైవ‌ర్‌పై దాడి చేయ‌డం ప్రారంభించారు. ఈ స‌మ‌యంలో అఫ్తాబ్ త‌న కుమారుడు మొహ‌మ్మ‌ద్ స‌బీర్‌కు ఫోన్ చేశాడు.. దాడిలో ఫోన్ కింద ప‌డిపోయింది. అవ‌త‌లి నుంచి స‌బీర్ హ‌లో.. హాలో.. అంటున్నా తండ్రి నుంచి స్పంద‌న లేక‌పోగా.. ‘జై శ్రీ‌రాం బోల్‌.. బోల్ జై శ్రీ‌రాం’అనే అరుపులు విన‌ప‌డ‌డంతో స‌బీర్ కాల్ రికార్డు చేశాడు. సుమారు 40 నిమిషాల పాటు కాల్ రికార్డు కాగా స‌బీర్ పోలీసుల‌కు స‌మాచారం అందించి వారితో క‌లిసి ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లేలోపు అఫ్తాబ్‌ను ఆక‌తాయిలు తీవ్రంగా కొట్టి చంపి.. మృత‌దేహాన్ని కారుకు క‌ట్టేసి పారిపోయారు.

అఫ్తాబ్ నాలుక క‌త్తిరించి, చెవులు, ముఖంపై విచ‌క్ష‌ణా ర‌హితంగా కొట్ట‌డంతో మృతిచెందాడ‌ని పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు దోపిడీ కేసును మాత్ర‌మే న‌మోదు చేసి మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారుల‌తో పాటు.. ఇద్దరు సోద‌రీమ‌ణులున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo