గురువారం 29 అక్టోబర్ 2020
Crime - Sep 24, 2020 , 17:36:42

క‌నిపించ‌కుండా పోయిన తండ్రి.. హ‌త్య చేసిన‌ట్లు ఒప్పుకున్న కొడుకు

క‌నిపించ‌కుండా పోయిన తండ్రి.. హ‌త్య చేసిన‌ట్లు ఒప్పుకున్న కొడుకు

రంగారెడ్డి : క‌నిపించ‌కుండా పోయిన తండ్రిని తానే చంపిన‌ట్లు కొడుకు అంగీక‌రించాడు. ఈ విషాద సంఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా చెవెళ్ల ప‌రిధి గుండాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానిక చెందిన ఎస్‌. కిష్ట‌య్య అనే వ్య‌క్తి నెల రోజుల‌క్రితం కనిపించ‌కుండా పోయాడు. బంధువులు ఎంత వెతికినా అత‌ని జాడ తెలియ‌లేదు. అనుమానంపై కొడుకును అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించ‌గా నేరం అంగీక‌రించాడు. కుటుంబ తాగాదాల కార‌ణంగా త‌ల్లితో క‌లిసి తండ్రిని చంపిన‌ట్లు ఒప్పుకున్నాడు. మృత‌దేహాన్ని త‌మ పొలంలోనే పాతిపెట్టిన‌ట్లు చెప్పాడు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 


logo