ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Jul 29, 2020 , 15:44:04

ప్రియురాలి కూతురిని న‌గ్నంగా చిత్రీక‌రించి బెదిరింపు

ప్రియురాలి కూతురిని న‌గ్నంగా చిత్రీక‌రించి బెదిరింపు

గుంటూరు : ఓ వ్య‌క్తి త‌న ప్రియురాలి కూతురి న‌గ్నంగా చిత్రీక‌రించి బెదిరింపుల‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న గుంటూరు జిల్లాలోని తెనాలిలో వెలుగు చూసింది. తెనాలీలోని ఇందిరా కాల‌నీకి చెందిన ఓ మ‌హిళ త‌న భ‌ర్త వ‌ద్ద విడాకులు తీసుకోకుండానే కుమార్తెతో క‌లిసి 2009 నుంచి ఒంట‌రిగా ఉంటోంది. ఈ క్ర‌మంలో ఆమెకు ఓ వ్య‌క్తి ప‌రిచ‌య‌మ‌య్యాడు. అత‌ను కూడా భార్య‌కు విడాకులు ఇవ్వ‌కుండానే.. త‌న బిడ్డ‌తో క‌లిసి ఉంటున్నాడు. ఇలా ఆ మ‌హిళ‌, ఇత‌ని మ‌ధ్య ఏర్ప‌డ్డ ప‌రిచ‌యం అక్ర‌మ సంబంధానికి దారి తీసింది. ఇద్ద‌రూ క‌లిసి స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. ఇద్ద‌రు అమ్మాయిల‌ను అత‌నే బీటెక్ చ‌దివించాడు. 

అయితే గ‌త కొంత కాలం నుంచి త‌న ప్రియురాలితో అత‌నికి గొడ‌వ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. దీంతో ఆమె కూతురు స్నానం చేస్తుండ‌గా.. గుట్టుగా వీడియోలు చిత్రీక‌రించాడు. ఇప్పుడు వాటిని అడ్డుపెట్టుకుని ఆమెను బెదిరిస్తున్నాడు. 

బాధిత మ‌హిళ సోమ‌వారం నిర్వ‌హించిన స్పంద‌న కార్య‌క్ర‌మంలో గుంటూరు రూర‌ల్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ కేసుల‌ను తెనాలి త్రీటౌన్ పోలీసుల‌కు అప్ప‌జెప్పారు. విచార‌ణ నిమిత్తం మ‌హిళ‌తో పాటు అత‌డిని స్టేష‌న్‌కు పిలిపించి మాట్లాడి ఇద్ద‌రి మ‌ధ్య రాజీ కుదిర్చారు. ఉద్దేశ‌పూర్వ‌కంగానే అత‌నిపై ఆ మ‌హిళ ఫిర్యాదు చేసిన‌ట్లు భావిస్తున్నామ‌ని పోలీసులు పేర్కొన్నారు.


logo