శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jul 27, 2020 , 16:11:34

వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్య, ఆమె ప్రియుడిని కాల్చి చంపాడు

వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్య, ఆమె ప్రియుడిని కాల్చి చంపాడు

బింద్‌ : మధ్యప్రదేశ్‌ రాష్ర్టం బింద్ జిల్లాలోని మౌల్‌లో ఓ వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను, ఆమె ప్రియుడిని కాల్పి చంపాడు. వివరాలు.. హత్వారా ప్రాంతానికి చెందిన ఆనంద్‌యాదవ్‌ భార్య సరోజ(25)తో కలిసి నివాసం ఉండేవాడు. గ్వాలియర్‌లో  కూలి పనులు చేసుకుంటూ నివసించే ఆనంద్‌యాదవ్‌ లాక్‌డౌన్‌ కారణంగా ఇటీవల స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. భార్య సరోజ అదే ప్రాంతానికి చెందిన నూనె వ్యాపారి అయిన హరియం అగర్వాల్‌(45)తో వివాహేతరం సంబంధం పెట్టుకుందని ఆనంద్‌యాదవ్‌ అనుమానిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో ఆనంద్‌ తుపాకితో భార్యను కాల్చి, అనంతరం తన మిత్రుడితో వెళ్లి హరియం అగర్వాల్‌ను కూడా కాల్చి చంపాడని ఏఎస్పీ సంజీవ్ సింగ్ కాంచన్ సోమవారం తెలిపారు. ప్రస్తుతం ఆనంద్‌యాదవ్‌ పరారీలో ఉన్నాడని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo