గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Aug 18, 2020 , 16:55:34

ఆదిలాబాద్ జిల్లాలో వాగులో పడి వ్యక్తి గల్లంతు

 ఆదిలాబాద్ జిల్లాలో వాగులో పడి వ్యక్తి గల్లంతు

ఆదిలాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సిరికొండ మండలం ధర్మసాగర్ వాగు దాటుతూ ఉండగా ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికుల కథనం మేరకు.. ధర్మసాగర్ కు చెందిన సింగడే గణపతి మరో ఇద్దరితో కలిసి పని కోసం గౌరాపూర్ గ్రామానికి వెళ్లాడు. పని ముగించుకొని తిరిగి వస్తుండగా ధర్మసాగర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మిగతా ఇద్దరు వాగు ఒడ్డునే ఉన్నారు. అయితే  గణపతి మాత్రం దాటే ప్రయత్నం చేశాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అతడు గల్లంతయ్యాడు. అధికారులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


logo