మంగళవారం 04 ఆగస్టు 2020
Crime - Jul 13, 2020 , 07:01:13

కరోనా వచ్చిందేమోనని అనుమానంతో వ్యక్తి ఆత్మహత్య

కరోనా వచ్చిందేమోనని అనుమానంతో వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్‌ : కరోనా వైరస్ సోకిందేమోనని అనుమానంతో కాల్ సెంటర్ ఉద్యోగి ఒకరు పట్టణంలోని సంతోష్‌నగర్‌లో శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. సంతోష్‌నగర్‌లోని ఖాలందర్‌నగర్‌లో నివాసముంటున్న సయ్యద్‌ సాదిక్‌ అలీ కొవిడ్‌19 కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్నాడు. సాదిక్ అలీ గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం ఆ ప్రాంతంలోని కొన్ని క్లినిక్‌లను సంప్రదించగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీంతో కొవిడ్‌ సోకిందేమోనని తీవ్ర ఆందోళనకు గురైన సాదిక్‌ ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సిబ్బంది తెలిపారు. 


logo