బుధవారం 27 జనవరి 2021
Crime - Nov 08, 2020 , 15:48:16

వాటర్‌ ట్యాంక్‌ పైకెక్కిన కుటుంబం.. ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపు

వాటర్‌ ట్యాంక్‌ పైకెక్కిన కుటుంబం.. ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపు

లక్నో: ఒక కుటుంబం వాటర్‌ ట్యాంక్‌ పైకి ఎక్కింది. తామంతా ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్‌రాజ్‌లో ఈ ఘటన జరిగింది. హార్డోయికి చెందిన ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి వాటర్ ట్యాంక్ పైకి ఎక్కాడు. స్థానిక గూండాలు తమ ఆస్తిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని, తమ ఇంటిని ఆక్రమించారని ఆరోపించాడు. స్థానిక అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశాడు. లేని పక్షంలో తామంతా ఆత్మహత్య చేసుకుంటామని ఆ కుటుంబం హెచ్చరించింది. తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్‌, పెట్రోల్‌ బాటిళ్లను చూపుతూ వారు ఈ మేరకు నినాదాలు చేశారు. వాటర్‌ ట్యాంక్‌పైకి ఎక్కిన వారిలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలతోపాటు ఒక పిల్లవాడు ఉన్నాడు. స్థానికుల్లో కొందరు తమ మొబైల్‌లో తీసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo