గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Jul 08, 2020 , 17:11:28

భూత‌గాదాలు.. మ‌హిళ‌పై మ‌ట‌న్ క‌త్తితో దాడి

భూత‌గాదాలు.. మ‌హిళ‌పై మ‌ట‌న్ క‌త్తితో దాడి

వ‌న‌ప‌ర్తి : అంద‌రూ చూస్తుండ‌గానే ఓ పెద్దాయ‌న‌.. మ‌హిళ‌పై మ‌ట‌న్ క‌త్తితో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచాడు. ఆమె కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణ ఘ‌ట‌న వ‌న‌ప‌ర్తి జిల్లా గోపాల్ పేట మండ‌లంలోని బుద్ధారంలో బుధ‌వారం ఉద‌యం చోటు చేసుకుంది. 

గ్రామానికి చెందిన ర‌త్న‌మ్మ‌కు, ఆమె కుటుంబ స‌భ్యుల‌కు మ‌ధ్య కొన్నేండ్ల నుంచి భూత‌గాదాలు ఉన్నాయి. దీంతో త‌రుచూ గొడ‌వ‌లు జ‌రిగేవి. మ‌ళ్లీ బుధ‌వారం ఉద‌యం కూడా ఒక‌రినొక‌రు ఘ‌ర్ష‌ణ ప‌డ్డారు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన ర‌త్న‌మ్మ బావ‌.. ఆమెపై మ‌ట‌న్ క‌త్తితో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశాడు. మెడ‌పై క‌త్తితో న‌రికాడు. అంతేకాకుండా పొత్తిక‌డుపుపై క‌త్తితో పొడ‌వ‌డంతో పేగులు బ‌య‌ట‌కొచ్చాయి. 

బాధితురాలి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో.. చికిత్స నిమిత్తం హైద‌రాబాద్ లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆమె ప‌రిస్థితి విష‌మించ‌డంతో.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న గోపాల్ పేట పోలీసులు.. ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాధితురాలి బంధువులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. 


logo