ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Jul 23, 2020 , 19:03:08

యువకుడిని దారుణంగా హత్య చేసిన ప్రేమ జంట

యువకుడిని దారుణంగా హత్య చేసిన ప్రేమ జంట

వైజాగ్ : విశాఖ జిల్లాలో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగులోనికి వచ్చిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. చనిపోయి రోజులు గడవడంతో మృతదేహం కుళ్లిపోయింది. ఆ ప్రాంతంలో దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది.విశాఖ జిల్లా మల్కాపురంలోని హనుమాన్ గుడి ప్రాంతానికి చెందిన స్వాతి, గాజువాకలోని గుడివాడ అప్పన్న కాలనీకి చెందిన జోగారావు ప్రేమించుకుంటున్నారు. కొద్దికాలంగా అప్పన్న కాలానికి చెందిన గుర్రం గణేష్ స్వాతిని వేధిస్తున్నాడు. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో.. ప్రియుడు జోగారావుకి చెప్పుకొని బాధపడేది. దీంతో జోగారావు పలుమార్లు హెచ్చరించినా గణేష్ వినిపించుకోలేదు.. రోజురోజుకు అతని వేధింపులు ఎక్కువయ్యా యి. దీంతో జోగారావు, స్వాతి లిద్దరు  

 అతన్ని అంతమొదించాలనుకున్నారు. ఫోన్ చేసి ఓ ప్రాంతానికి రమ్మని చెప్పారు. వచ్చాక ఒక్కసారిగా ఇద్దరు కలిసి అతని పై  దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గణేష్ అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రెండు రోజుల తర్వాత మృతదేహాన్ని కాలువలో పడేసి నిప్పు అంటించారు. శవం సగం మాత్రమే కలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించి మృతుడి ఆచూకీ కనుగొన్నారు. కేసు దర్యాప్తు చేసి విచారణ చేపట్టారు.  


logo