ఆదివారం 24 జనవరి 2021
Crime - Nov 12, 2020 , 08:32:22

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

యాదాద్రి భువనగిరి : వివాహేతర సంబంధం ఓ మహిళ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రం శివారులో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన వెలుగు చూసింది. జనగామ జిల్లా పెద్దమడుగుకు చెందిన లక్ష్మి భర్త చనిపోవడంతో హైదరాబాద్‌కు వచ్చింది. ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో పని చేస్తున్న ఆమె.. గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఆర్యకుమార్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు హైదరాబాద్‌ నుంచి భునగిరి శివారులోని నిర్మాణుష్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఇద్దరికి డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆర్యకుమార్‌ తన వద్ద ఉన్న సర్కిల్‌ బ్లేడ్‌తో లక్ష్మిని హత్య చేశాడు. అనంతరం అర్ధరాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని గుర్తించి, భువనగిరి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo