ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jun 19, 2020 , 18:17:56

చిరుత పులిని చంపేశారు..

చిరుత పులిని చంపేశారు..

సిమ్లా : హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాజధాని సిమ్లాకు స‌మీపంలోని హీరాన‌గ‌ర్ లో ఘోరం జ‌రిగింది. ఓ చిరుత పులిని గుర్తు తెలియ‌ని దుండ‌గులు తుపాకితో కాల్చి చంపారు. ఈ ఘ‌ట‌న‌పై సిమ్లా డివిజ‌న్ ఫారెస్టు ఆఫీస‌ర్ సుశీల్ రానా మాట్లాడుతూ.. హీరా న‌గ‌ర్ లో చిరుత మృతదేహం ల‌భ్య‌మైంద‌ని తెలిపారు. ఆ త‌ర్వాత చిరుత క‌ళేబరాన్ని పోస్టుమార్టంకు త‌ర‌లించాం. దాని మెడ‌పై బుల్లెట్ గాయాలు ఉన్న‌ట్లు పోస్టుమార్టం నివేదిక‌లో తేలింద‌ని సుశీల్ రానా చెప్పారు. పులిని చంపేసిన ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. 


logo