సోమవారం 26 అక్టోబర్ 2020
Crime - Sep 22, 2020 , 22:11:32

మెదక్‌లో భారీ చోరీ.. కంటైనర్‌ నుంచి 2వేల ఫోన్లు లూటీ

మెదక్‌లో భారీ చోరీ.. కంటైనర్‌ నుంచి 2వేల ఫోన్లు లూటీ

వెల్దుర్తి : జాతీయ రహదారి 44పై చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసాయిపేట దాబా వద్ద భారీ దోపిడీ జరిగింది. సెల్‌ఫోన్లు తరలిస్తున్న ఓ లారీ కంటైనర్ నుంచి దాదాపు రెండున్న కోట్ల విలువైన సెల్‌ఫోన్లను దుండగులు దోచుకెళ్లారు. సెల్ ఫోన్ల సంఖ్య దాదాపు 2442 ఉంటుందని పోలీసులు తెలిపారు. కంటైనర్ కొత్త ఫోన్ల లోడుతో చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్తోంది. పక్కా ప్రణాళిక ప్రకారమే దొంగలు ఈ కంటైనర్‌‌ను లూటీ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సెల్‌ఫోన్ల లోడుతో చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఈ భారీ కంటైనర్‌ను దొంగలు వెంబడించినట్లు తెలుస్తోంది. అనుకూలమైన ప్రాంతం రాగానే చోరీకి పాల్పడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద డ్రైవర్, సహాయకుడు భోజనం చేసేందుకు ఓ హోటల్ వద్ద లారీ ఆపారు. వారు భోజనాలకు లోనికి వెళ్లగానే ఈ లోపు దొంగలు రూ.14 కోట్ల విలువైన 2,442 సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు దొంగలను పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo