మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Sep 01, 2020 , 14:20:18

మున్నేరులో మునిగి పశువుల కాపరి మృతి

మున్నేరులో మునిగి పశువుల కాపరి మృతి

ఖమ్మం : జిల్లాలోని చింతకాని మండలం చిన్నమండవ గ్రామానికి చెందిన తిరుపతిరావు (63) అనే వ్యక్తి మంగళవారం మున్నేరులో  మునిగి చనిపోయాడు. స్థానికుల కథనం మేరకు.. తిరుపతి రావు పశువులు కాస్తూ జీవిస్తున్నాడు. బర్లకు నీళ్లు పెట్టేందుకు మున్నేరు వాగులోకి తోలుకెళ్లాడు. తాను కూడా వాటితోపాటు దిగటంతో నీటిలో మునిగి చనిపోయాడు. సమీపంలో ఉన్న వ్యక్తులు గమనించి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


logo