ఆదివారం 17 జనవరి 2021
Crime - Jan 06, 2021 , 12:38:11

శంషాబాద్‌లో మైన‌ర్‌పై 40 ఏండ్ల వ్య‌క్తి లైంగిక‌దాడి

శంషాబాద్‌లో మైన‌ర్‌పై 40 ఏండ్ల వ్య‌క్తి లైంగిక‌దాడి

రంగారెడ్డి : శ‌ంషాబాద్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ర్యాల‌గూడ‌లో దారుణం జ‌రిగింది. గ‌త మూడు నెల‌ల నుంచి ఓ 40 ఏండ్ల వ్య‌క్తి.. మైన‌ర్‌(15)పై లైంగిక‌దాడికి పాల్ప‌డుతున్నాడు. విష‌యం బ‌య‌ట‌కు చెబితే చంపేస్తాన‌ని ఆ అమ్మాయిని బెదిరిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి.. గ‌త మూడు నెల‌ల నుంచి లైంగికదాడికి పాల్ప‌డుతున్నాడు అని బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో నిందితుడిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ర్యాల‌గూడ‌కు చెందిన స‌తీష్‌గా గుర్తించారు. అత‌ను శంషాబాద్‌లో పూల వ్యాపారం చేస్తున్నాడు.