సోమవారం 08 మార్చి 2021
Crime - Jan 18, 2021 , 12:41:13

కూక‌ట్‌ప‌ల్లిలో దారుణం.. కుమారుడికి నిప్పంటించిన తండ్రి

కూక‌ట్‌ప‌ల్లిలో దారుణం.. కుమారుడికి నిప్పంటించిన తండ్రి

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని కూక‌ట్‌ప‌ల్లి హౌసింగ్ బోర్డు కాల‌నీలో దారుణం జ‌రిగింది. కుమారుడిపై టార్పెంటాయిల్ పోసి నిప్పంటించాడు తండ్రి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని బాధిత విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స‌రిగా చ‌ద‌వ‌డం లేద‌నే కోపంతోనే కుమారుడికి నిప్ప‌టించిన‌ట్లు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. బాధిత విద్యార్థి చ‌ర‌ణ్‌(10) ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. 


VIDEOS

logo