గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Jul 12, 2020 , 13:05:33

కీచ‌క తండ్రి.. కూతురిపై అత్యాచారం

కీచ‌క తండ్రి.. కూతురిపై అత్యాచారం

విజ‌య‌న‌గ‌రం : ఓ కామాంధుడికి క‌ళ్లు మూసుకుపోయాయి. అనారోగ్యం బాగా లేద‌ని చెప్పి.. కూతురుని ఇంటికి పిలిపించుకుని ఆమెపై అత్యాచారం చేశాడు తండ్రి. ఈ అమాన‌వీయ ఘ‌ట‌న విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని సీతాన‌గ‌రం మండ‌లంలో చోటు చేసుకుంది. 

నిడ‌గ‌ల్లు గ్రామానికి చెందిన పైల మైన‌రు అనే వ్య‌క్తికి ఇద్ద‌రు కుమార్తెలు. వారిద్ద‌రికి వివాహాలు చేశాడు. ఇద్ద‌రు అల్లుళ్ల‌ది కూడా నిడ‌గ‌ల్లే. అయితే మైన‌రు త‌న పెద్ద కూతురిపై క‌న్నేశాడు. దీంతో త‌న‌కు ఆరోగ్యం బాగాలేద‌ని చెప్పి.. ఇద్ద‌రు కుమార్తెల‌కు స‌మాచారం ఇచ్చాడు. ఈ క్ర‌మంలో చిన్న కూతురు వ‌చ్చి తండ్రికి సేవ‌లు చేయ‌డం మొద‌లు పెట్టింది. ఇక నీవు వెళ్లు.. ఎన్ని రోజుల‌ని సేవ‌లు చేస్తావు.. అక్క‌ను పిలిపించు అని తండ్రి చిన్న కుమార్తెకు చెప్పాడు. 

చెల్లి వెళ్ల‌డంతో అక్క శుక్ర‌వారం త‌న తండ్రి నివాసానికి వ‌చ్చింది. తండ్రి ఆరోగ్యం గురించి వాకబు చేసింది. మొత్తానికి కామంతో ఆమెపై క‌న్నేసిన తండ్రి.. కోరిక తీర్చుకోవ‌డానికి ఇదే అనుకూల స‌మ‌య‌ని భావించాడు. దీంతో ఆమెను బెదిరించి అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు.  

ఈ అవ‌మానాన్ని భ‌రించ‌లేని బాధితురాలు.. శుక్ర‌వారం సాయంత్ర‌మే గ్రామ వాలంటీర్ స‌హాయంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న బొబ్బిలి పోలీసులు.. నిడ‌గ‌ల్లు వెళ్లి విచార‌ణ చేప‌ట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని శ‌నివారం రిమాండ్ కు త‌ర‌లించారు పోలీసులు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.


logo