బుధవారం 27 జనవరి 2021
Crime - Nov 07, 2020 , 12:46:30

సిద్దిపేట‌లో దారుణం.. కుమార్తెల గొంతు కోసిన తండ్రి

సిద్దిపేట‌లో దారుణం.. కుమార్తెల గొంతు కోసిన తండ్రి

సిద్దిపేట : ‌దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో దారుణం జ‌రిగింది. ఓ తండ్రి త‌న కుమార్తెల ప‌ట్ల క్రూరంగా ప్ర‌వ‌ర్తించాడు. ఇద్ద‌రు కుమార్తెల గొంతు కోశాడు తండ్రి. దీన్ని గ‌మ‌నించిన స్థానికులు.. త‌క్ష‌ణ‌మే పోలీసుల‌కు స‌మాచారం అందించి.. ఇద్ద‌రి పిల్ల‌ల ప్రాణాలు కాపాడారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన ఎండీ మహమ్మద్ 15 సంవత్సరాల క్రితం మిర్‌దొడ్డి మండలంలోని మోతే గ్రామానికి వ‌ల‌సొచ్చాడు. మోతే గ్రామంలో మాంసం విక్ర‌యిస్తూ జీవ‌నోపాధి కొన‌సాగిస్తున్నాడు. అయితే శుక్ర‌వారం రోజు దుబ్బాక మండ‌లం చిట్టాపూర్ గ్రామానికి చెందిన గుంజేడు సాయిలు ఇంట్లో మ‌హ‌మ్మ‌ద్ అద్దెకు దిగాడు. శ‌నివారం ఉద‌య‌మే పీక‌ల దాకా మ‌ద్యం సేవించిన మ‌హ‌మ్మ‌ద్‌.. ఆ మ‌త్తులో త‌న ఇద్ద‌రు కుమార్తెలను ఇంట్లో బంధించి.. చంపేస్తాన‌ని బెదిరించాడు. విష‌యం తెలుసుకున్న స్థానికులు భూంప‌ల్లి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని పిల్ల‌ల‌ను చికిత్స నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పిల్ల‌ల ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంది.

పిల్ల‌ల‌ను కాపాడిన కానిస్టేబుళ్లు

చిట్టాపూర్‌లోని మ‌హ‌మ్మ‌ద్ ఇంటి వ‌ద్ద‌కు కానిస్టేబుళ్లు రాజిరెడ్డి, రాజు చేరుకున్నారు. లోప‌లి నుంచి త‌లుపుకు గ‌డియ పెట్ట‌డంతో.. ఇంటి పైక‌ప్పు నుంచి కానిస్టేబుళ్లు లోప‌లికి వెళ్లారు. అప్ప‌టికే ఇద్ద‌ర‌మ్మాయి గొంత‌ను మ‌హ‌మ్మ‌ద్ క‌త్తితో కోశాడు. మొత్తానికి మ‌హమ్మ‌ద్ నుంచి ఆ పిల్ల‌ల‌ను పోలీసులు కాపాడారు. ఈ క్ర‌మంలో పోలీసులిద్ద‌రికి స్వ‌ల్పంగా గాయాల‌య్యాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. logo