శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 20, 2020 , 18:06:14

రోగి చనిపోయాడని చెప్పిన లేడీ డాక్టర్ చెంప చెళ్లుమనిపించారు..

రోగి చనిపోయాడని చెప్పిన లేడీ డాక్టర్ చెంప చెళ్లుమనిపించారు..

ముంబై: రోగి చనిపోయాడని చెప్పిన లేడీ డాక్టర్ చెంప చెళ్లుమనిపించారు బంధువులు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈ ఘటన జరిగింది. ఎంజీఎం ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న ఒక రోగి బుధవారం మరణించాడు. ఓ వైద్యురాలు ఈ విషయాన్ని వారి బంధువులకు చెప్పింది. దీంతో బంధువుల్లో ఒకరు ఆమె చెంపపై కొట్టారు. ఈ ఘటనపై తోటి వైద్యులు నిరసన తెలిపారు. కాగా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని దవాఖాన అధికారి తెలిపారు. వైద్యులపై దాడులను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. వైద్యులపై దాడులు చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యేలా ఒక చట్టాన్ని కూడా తెచ్చింది. అయినప్పటికీ డాక్టర్లపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo