బుధవారం 25 నవంబర్ 2020
Crime - Oct 21, 2020 , 13:40:15

క‌స్ట‌మ‌ర్‌ను చీట్ చేసిన డెలివ‌రీ బాయ్‌

క‌స్ట‌మ‌ర్‌ను చీట్ చేసిన డెలివ‌రీ బాయ్‌

న్యూఢిల్లీ: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ కామ‌ర్స్ దిగ్గ‌జాలు పండుగ‌ల సీజ‌న్‌లో బిజీబిజీగా సేవ‌లందిస్తుంటాయి. అయితే, సంస్థ‌ల సేవ‌లు బాగానే ఉన్నా.. అప్పుడ‌ప్పుడు ఆ సంస్థ‌ల‌కు చెందిన కొంద‌రు డెలివ‌రీ బాయ్స్ క‌స్ట‌మ‌ర్‌లను చీట్ చేస్తున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు త‌ర‌చూ ఎక్క‌డో ఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో ఇలాంటి మోస‌మే బ‌య‌ట‌ప‌డింది. ఆన్‌లైన్‌లో మొబైల్ బుక్ చేసిన ఓ క‌స్ట‌మ‌ర్‌ను అమెజాన్‌ డెలివ‌రీ బాయ్ మోసం చేశాడు. క‌స్ట‌మ‌ర్‌కు ఇవ్వాల్సిన ఫోన్‌ను ఇవ్వ‌కుండా సొంతానికి వాడుకున్నాడు.

నిర్ణీత గ‌డువు ముగిసినా తాను బుక్ చేసిన మొబైల్ ఇంకా చేతికి రాక‌పోవ‌డంతో క‌స్ట‌మ‌ర్ డెలివ‌రీ బాయ్‌కు ఫోన్ చేసి ఆరాతీశాడు.  దాంతో ఆర్డ‌ర్ క్యాన్సిల్ అయ్యింద‌ని, మ‌నీ రీఫండ్ అవుతుంద‌ని డెలివ‌రీ బాయ్ క‌స్ట‌మ‌ర్‌కు అబ‌ద్దం చెప్పి త‌ప్పించుకున్నాడు. ఆ త‌ర్వాత త‌న ఫోన్‌కు ప్రోడ‌క్ట్ డెలివ‌రీ అయిన మెసేజ్ రావ‌డంతో క‌స్ట‌మ‌ర్ పోలీసులకు కంప్లెయింట్ చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించ‌గా చేసిన నేరం ఒప్పుకున్నాడు. దాంతో అత‌నిపై కేసు న‌మోదు చేసి, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు.        

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.