శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Jun 29, 2020 , 17:01:59

అందంగా లేన‌ని అబ్బాయి ఆత్మ‌హ‌త్య‌

అందంగా లేన‌ని అబ్బాయి ఆత్మ‌హ‌త్య‌

శ్రీకాకుళం : అందం అన‌గానే గుర్తొచ్చేది అమ్మాయిలు. అందాల‌తో అబ్బాయిల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేస్తారు. ఓ అబ్బాయి కూడా అమ్మాయిలా అందంగా ఉండాల‌నుకున్నాడు. కానీ అత‌ని ముఖంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లు ఉండ‌టంతో అందంగా క‌న‌బ‌డ‌లేక‌పోతున్నాడు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది. 

జిల్లాలోని మాణిక్య‌పురానికి చెందిన సునీల్ నాయ‌క్(20) డిగ్రీ చ‌దువుతున్నాడు. కాలేజీలో అమ్మాయిలు ఉండ‌టంతో నాయ‌క్ కూడా అందంగా త‌యార‌య్యే వెళ్లేవాడు. కానీ త‌న ముఖంపై మ‌చ్చ‌లు, మొటిమ‌లు ఉన్నాయి. అందంగా త‌యారైన‌ప్ప‌టికీ కూడా మ‌చ్చ‌లు ఇబ్బంది క‌లిగించేవి. దీంతో ముఖంపై రూమాలు వేసుకుని బ‌య‌ట‌కు వెళ్లేవాడు సునీల్. మ‌చ్చ‌ల‌ను తొల‌గించుకునేందుకు డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించాడు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేదు.

తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన సునీల్ నాయ‌క్.. ఆదివారం ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.  ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని సోంపేట ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.  

తాజావార్తలు


logo