శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Aug 20, 2020 , 18:35:29

కొరియర్ పార్శిల్‌లో.. రూ.39 లక్షల విదేశీ కరెన్సీ

కొరియర్ పార్శిల్‌లో.. రూ.39 లక్షల విదేశీ కరెన్సీ

చెన్నై: ఒక కొరియర్ పార్శిల్‌లో సుమారు రూ.39 లక్షల విలువైన విదేశీ కరెన్సీ బయటపడింది. తమిళనాడులోని చెన్నై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు గురువారం ఈ పార్సిల్‌ను గుర్తించారు. ఎయిర్‌పోర్టులోని కొరియర్ టెర్మినల్ వద్ద సింగపూర్‌కు పంపుతున్న ఒక పార్శిల్‌ పెట్టెపై అనుమానం వ్యక్తం చేసి తనిఖీ చేశారు. దాన్ని తెరిచి చూడగా ప్రత్యేకంగా తయారు చేసిన స్టీల్ పేట్ల మధ్య భారీగా విదేశీ కరెన్సీ ఉన్నది.

మొత్తం 25 స్టీల్ పేట్ల మధ్య 40 వేల బ్రిటీష్ పౌండ్లు ఉన్నాయి. మన కరెన్సీలో దీని విలువ రూ.38.64 లక్షలని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ కొరియర్ పార్శిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీన్ని పంపుతున్న ఒకరిని అరెస్ట్ చేశారు. ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo