శుక్రవారం 15 జనవరి 2021
Crime - Dec 26, 2020 , 16:13:44

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. కార్మికుడిపైకి దూసుకెళ్లిన కంటైన‌ర్‌

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. కార్మికుడిపైకి దూసుకెళ్లిన కంటైన‌ర్‌

కామారెడ్డి : జిల్లాలోని స‌దాశివ‌న‌గ‌ర్ మండ‌లం ప‌ద్మాజివాడి వ‌ద్ద జాతీయ ర‌హ‌దారి 44పై రోడ్డు ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఓ కార్మికుడు వాహ‌నాల‌ను ఆపే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాడు. అయితే ఓ కంటైన‌ర్ ఆ కార్మికుడి ఆదేశాల‌ను ప‌ట్టించుకోకుండా ముందుకెళ్తున్న క్ర‌మంలో, ఆ వాహ‌నాన్ని ఆపేందుకు య‌త్నించాడు. దీంతో కంటైన‌ర్ వెనుక టైర్ల కింద కార్మికుడు ప‌డిపోయాడు. అక్క‌డే ఉన్న పోలీసులు అప్ర‌మ‌త్త‌మై క్ష‌త‌గాత్రుడిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాధితుడికి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన కార్మికుడిగా గుర్తించారు. కంటైన‌ర్ డ్రైవ‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లు స‌మాచారం.