శుక్రవారం 22 జనవరి 2021
Crime - Nov 25, 2020 , 15:44:42

చైనీస్ అలుగు ప‌ట్టివేత‌‌.. న‌లుగురు నిందితులు అరెస్ట్‌

చైనీస్ అలుగు ప‌ట్టివేత‌‌.. న‌లుగురు నిందితులు అరెస్ట్‌

గువాహ‌టి: అసోంలో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ఓ చైనీస్ అలుగు (పంగోలిన్)‌ను అక్క‌డి అధికారులు సీజ్ చేశారు. ఆ అలుగును త‌ర‌లిస్తున్న న‌లుగురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. ఒడిశాలో కొంద‌రు ముఠాగా ఏర్ప‌డి అలుగుల‌ అక్ర‌మ ర‌వాణాకు పాల్ప‌డుతున్నారన్న స‌మాచారం మేర‌కు వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, అసోం పోలీసులు, అటవీ అధికారులు సంయుక్త ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. ఈ ఆప‌రేష‌న్‌లో భాగంగా గువాహ‌టిలోని బొరాగావ్ చ‌రాలి ప్రాంతంలో త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న అధికారుల‌కు అలుగు ప‌ట్టుబ‌డింది. ఈ విష‌యాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్‌, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మీడియాకు వెల్ల‌డించింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo