శనివారం 23 జనవరి 2021
Crime - Nov 15, 2020 , 14:29:07

చెరువులో శవమై తేలిన చిన్నారి

చెరువులో శవమై తేలిన చిన్నారి

సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో మూండేండ్ల చిన్నారి చెరువులో పడి అనుమానాస్పదంగా మృతి చెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసుల కథనం మేరకు.. కటికె మరియా కుటుంబ సభ్యులు అందరూ కలిసి శనివారం రాత్రి 9 గంటలకు భోజనం చేశారు. పాప తండ్రి మస్తాన్ వేరే గ్రామానికి ఫంక్షన్‌కు పోయి రాత్రి 12 గంటలకు ఇంటికి చేరుకునేసరికిసరికి పాప లేదని తెలియడంతో చుట్టు పక్కల వెతికారు.

ఎక్కడా కూడా పాప ఆచూకీ దొరకలేదు. ఉదయం చిన్నారి చెరువులో శవమై తేలింది. కాగా, పాప మృతిపై పలు అనుమానాలు వ్యకమవుతున్నాయి. మస్తాన్‌కు ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకు ఉన్నారు. ఇదివరకే ఒక పాప కూడా చనిపోయింది. పోలిసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


logo