సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Sep 13, 2020 , 15:44:14

బాలిక‌ను వేధింపుల‌కు గురిచేసిన తాంత్రికుడిపై కేసు న‌మోదు

బాలిక‌ను వేధింపుల‌కు గురిచేసిన తాంత్రికుడిపై కేసు న‌మోదు

హైదరాబాద్ : మైన‌ర్‌ను వేధింపుల‌కు గురిచేసిన‌ తాంత్రికుడిపై శ‌నివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. వివ‌రాలు.. 48 ఏండ్ల ర‌మేశ్‌బాబు అనే తాంత్రికుడికి 2018లో ఓ మ‌హిళ‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ మ‌హిళ భ‌ర్త మ‌ర‌ణించ‌డంతో నీ ఇంట్లో ఏదో కీడు ఉంద‌ని.. అందుకే నీ భ‌ర్త మ‌ర‌ణించాడ‌ని న‌మ్మిస్తూ ఏవేవో పూజ‌ల పేరిట తాంత్రికుడు ప‌లుమార్లు ఆమె ఇంటిని సంద‌ర్శించాడు.  

మ‌హిళ‌కు ఓ మైన‌ర్ కుమార్తె ఉండ‌గా ఆమెపై క‌న్నేసిన స‌ద‌రు తాంత్రికుడు.. బాలిక‌ను త‌న‌కిచ్చి పెళ్లి చేస్తే అంతా న‌య‌మై పోతుంద‌ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇదే విష‌య‌మై త‌ల్లీబిడ్డ‌ల‌ను వేధింపుల‌కు గురి చేస్తుండ‌డంతో తాళ‌లేక బంజారాహిల్స్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo