మంగళవారం 26 జనవరి 2021
Crime - Oct 13, 2020 , 09:47:01

పొలంలోకి దూసుకెళ్లిన కారు

పొలంలోకి దూసుకెళ్లిన కారు

వనపర్తి : కొత్తపేట సమీపంలో జాతీయ రహదారి 44 బైపాస్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు అదుపు తప్పి కారు పొలంలో దూసుకు వెళ్లింది. దీంతో కారు ధ్వంసమైంది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు ప్రయాణిస్తుండగా.. గణేశ్‌రెడ్డి, శివ అనే ఇద్దరు గాయపడగా దవాఖానకు తరలించారు. కాగా, సంఘటన సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగి ఉంటుందని సమాచారం. ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కారు బోల్తా పడి పల్టీలు కొట్టి ఉంటుందని భావిస్తున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo