బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Jul 30, 2020 , 13:09:54

పుట్టిన రోజుకు ఒకరోజు ముందుగానే నీటమునిగి చనిపోయిన బాలుడు

పుట్టిన రోజుకు ఒకరోజు ముందుగానే నీటమునిగి చనిపోయిన బాలుడు

అమరావతి: విజయవాడ వన్‌టౌన్‌ పరిధిలో విషాదం నెలకొంది. పుట్టిన రోజుకు వేడుకలు నిర్వహిస్తుండగానే కుమారుడు నీట మునిగి మృతిచెందడంతో ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. నిఖిలేశ్‌ అనే నాలుగేళ్ల కుమారుడి పుట్టిన రోజును శుక్రవారం ఆనందోత్సాహలతో నిర్వహించాలని తల్లిదండ్రులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

గురువారం నీటి ట్యాంకుపై ఎక్కి ఆడుకుంటున్న కుమారుడు కాలు జారి అందులో పడిపోయాడు. కొద్దిసేపటికి గమనించిన కుమారుడి కోసం వెతకగా నీటి ట్యాంక్‌లో శవమై కనిపించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. పుట్టినరోజు వేడుకలకు చేసిన ఏర్పాట్లను తలుచుకుంటూ తల్లిదండ్రుల రోదన స్థానికులకు సైతం కంట నీరు తెప్పించింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo