ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jul 19, 2020 , 11:47:35

రైల్వే అండర్ బ్రిడ్డి కింద నీటిలో చిక్కుకున్న బస్సు.. ఒకరి మృతి

రైల్వే అండర్ బ్రిడ్డి కింద నీటిలో చిక్కుకున్న బస్సు.. ఒకరి మృతి

న్యూఢిల్లీ: రైల్వే అండర్ బ్రిడ్డి కింద నీటిలో ఒక బస్సు చిక్కుకోగా అందులోని డ్రైవర్ మునిగి మృతి చెందాడు. ఢిల్లీలోని మింటో ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీగా నీరు నిలిచిపోయింది. ఆదివారం ఉదయం ఆ నీటిలో ఒక బస్సు చిక్కుకుపోయింది. అనంతరం ఆ బస్సు ముందు నీటిపై తేలుతున్న ఒక మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌మాన్ రామ్‌నివాస్ మీనా చూశారు. వెంటనే ఈదుకొంటూ వెళ్లి ఆ మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు.

కాగా, చనిపోయిన వ్యక్తిని కుందన్‌గా గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆయన బస్సు డ్రైవర్ అని, ఉదయం నీట మునిగిన వంతెన కింద నుంచి బస్సును నడిపేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ క్రమంలో బస్సు నీటిలో చిక్కుకుపోవడంతో 60 ఏండ్ల డ్రెవర్ కుందన్ మునిగి చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

logo