శుక్రవారం 22 జనవరి 2021
Crime - Jan 08, 2021 , 18:56:30

పోలీసులపై మందుబాబుల వీరంగం

పోలీసులపై మందుబాబుల వీరంగం

జోగులాంబ గద్వాల : పోలీసులపై మందుబాబులు వీరంగం సృష్టించిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని ఉండవెల్లి మండల పరిధిలోని అల్లంపూర్ చౌరస్తాలో ఉమామహేశ్వర హోటల్ నిర్వాహకులపై కర్నూలు జిల్లాకు చెందిన ఆరుగురు మందుబాబులు దాడి చేసి వీరంగం సృష్టించారు. దీంతో హోటల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన గల కారణాలను అడిగి తెలుసుకుంటుడగా.. పోలీసులపై దాడి చేసి నలుగురు పరారయ్యారు. 

మిగిలిన ఇద్దరిని ఆటోలో పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా డ్రైవర్‌పై, పోలీసులపై మరోమారు దాడి చేశారు. దీంతో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో కర్నూలు ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఎస్‌ఐ జగన్మోహన్ తెలిపారు.

ఇవి కూడా చ‌ద‌వండి

ఉద్యోగ నియామకాల కోసం గిరిజన యువతకు శిక్షణ

బుధేరాలో నాటు కోళ్లు మృతి..ఆందోళనలో గ్రామస్తులు

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి 

రైతు వేదికలు దేశానికే ఆదర్శం : మంత్రి మల్లారెడ్డి 

రైల్వేలో రక్షణకే ప్రాధాన్యం : డీఆర్‌ఎం ఏకే గుప్తా


logo