బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Jul 07, 2020 , 12:16:15

క్వారంటైన్ కేంద్రంలో వృద్ధుడు ఆత్మహత్య

క్వారంటైన్ కేంద్రంలో వృద్ధుడు ఆత్మహత్య

ముంబై: కరోనా సోకిన ఒక వృద్ధుడు క్వారంటైన్ కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని పూణేలో ఈ ఘటన జరిగింది. 60 ఏండ్ల వ్యక్తితో పాటు అతడి కుమారుడికి కరోనా పాజిటివ్‌గా ఇటీవల నిర్ధారణ అయ్యింది. దీంతో వారిద్దరిని కొంధ్వలోని క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు.

అయితే సోమవారం తండ్రి ఉరివేసుకుని చనిపోయాడు. అయితే ఆ వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియలేదు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పూణే పోలీసులు తెలిపారు. పూణేలో కరోనా కేసుల సంఖ్య 30 వేలు దాటగా, 890 మంది మరణించారు.


logo