ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jun 19, 2020 , 07:59:04

ఆస్ప‌త్రిలో ఉరేసుకున్న క‌రోనా రోగి

ఆస్ప‌త్రిలో ఉరేసుకున్న క‌రోనా రోగి

హ‌ర్యానా : దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు అధిక‌మ‌వుతున్నాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో దేశ ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. క‌రోనా సోకిన వ్య‌క్తులు కొంద‌రు ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు. 

హ‌ర్యానాలోని ముల్ల‌న్న పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో.. క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన ఓ 55 ఏళ్ల‌ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆస్ప‌త్రిలో తాను చికిత్స పొందుతున్న వార్డులోనే ఉరేసుకుని ఈ అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు రోగి. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

రోగి కుటుంబ స‌భ్యుల‌కు పోలీసులు స‌మాచారం అందించారు. ప‌ది ఫీట్ల భౌతిక దూరం పాటిస్తూ.. అత‌ని అంత్య‌క్రియ‌ల్లో కుటుంబ స‌భ్యులు పాల్గొన్నారు. మృతుడి కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 3,81,091 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 12,604 మంది చ‌నిపోయారు. అత్య‌ధికంగా మ‌హారాష్ర్ట‌లో 1,20,504 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అక్క‌డ 5,751 మంది ప్రాణాలు విడిచారు. హర్యానా విష‌యానికి వ‌స్తే.. 134 మంది చ‌నిపోగా, 9,128 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. logo