సోమవారం 25 జనవరి 2021
Crime - Dec 10, 2020 , 12:14:42

మ‌హిళ‌పై 17 మంది సామూహిక అత్యాచారం!

మ‌హిళ‌పై 17 మంది సామూహిక అత్యాచారం!

రాంచి: జార్ఖండ్‌లో దారుణం జ‌రిగింది. ముప్పై ఐదేండ్ల వ‌య‌సున్న ఓ మ‌హిళ‌పై 17 మంది సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు మాన‌వ మృగాళ్లా ఆమెపై ప‌డి అఘాయిత్యం చేశారు. దుమ్కా జిల్లా ముఫాసిల్ ఏరియాలో మంగ‌ళ‌వారం రాత్రి ఈ అమానుష‌ ఘ‌ట‌న చోటుచేసుకుంది. బాధితురాలు మార్కెట్‌కు వెళ్లి తిరిగి ఇంటి వ‌స్తుండ‌గా దుండ‌గులు ఎత్తుకెళ్లి ఈ దుర్మార్గానికి ఒడిగ‌ట్టారు. బాధిత మ‌హిళ‌ ఫిర్యాదు మేర‌కు గురువారం ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాధితురాలిని వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆస్ప‌త్రిలో చేర్పించారు. 

కాగా, జాతీయ మ‌హిళా క‌మిష‌న్ ఈ కేసును సుమోటోగా స్వీక‌రించి విచార‌ణ చేప‌ట్టింది. ఘ‌ట‌న‌కు సంబంధించి జార్ఖండ్ డీజీపీకి లేఖ రాసింది. అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై రెండు నెల‌ల‌లోగా ద‌ర్యాప్తు పూర్తిచేయాల‌న్న‌ కేంద్ర హోంశాఖ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం రెండు నెలల్లో ద‌ర్యాప్తు ముగించాల‌ని ఆ లేఖ‌లో సూచించింది. అంతేగాక ఈ కేసులో తీసుకున్న చ‌ర్య‌లకు సంబంధించి సంపూర్ణ నివేదిక‌ను త‌మ‌కు స‌మ‌ర్పించాల‌ని మ‌హిళా క‌మిష‌న్ డీజీపీని కోరింది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo