గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Jun 27, 2020 , 20:38:16

హత్య కేసులో 9మంది అరెస్టు

హత్య కేసులో 9మంది అరెస్టు

హోషంగాబాద్‌ : మధ్యప్రదేశ్‌లోని పిపరియా పట్టణంలోని హోషంగాబాద్‌ ప్రాంతంలో శుక్రవారం జరిగిన విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) నాయకుడి హత్య కేసులో సంబంధముందని భావిస్తున్న 9మందిని అరెస్టు చేసినట్లు అదనపు ఎస్పీ అవదేశ్‌ ప్రతాప్‌ సింగ్‌ తెలిపారు. వీరిపై ఐపీసీ 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. హోషంగాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన విశ్వహిందూ పరిషత్‌ నాయకుడిపై దుండగులు దాడి చేసి కాల్చి చంపిన విషయం తెలిసిందే. దోషులను విచారిస్తున్నామని, నేరంలో పాల్పంచుకున్న అందరిని అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్నట్లు చెప్పారు.  నిందితుల ఆచూకీ తెలిపిన వారికి ఒక్కరికీ రూ.10వేలు అందజేస్తామని పిపరియా సబ్‌-డివిజన్‌ పోలీస్‌ అధికారి శివేంద్రజోషి ప్రకటించారు. 


logo