గురువారం 21 జనవరి 2021
Crime - Jan 02, 2021 , 17:18:11

పాయువుల్లో బంగారం.. ప‌ట్టుబ‌డ్డ నిందితులు

పాయువుల్లో బంగారం.. ప‌ట్టుబ‌డ్డ నిందితులు

చెన్నై: క‌స్టమ్స్ అధికారులు ఎంత‌మందిని దొర‌క‌బ‌ట్టినా బంగారం స్మ‌గ్లర్లు మాత్రం ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డంలేదు. నిత్యం బంగారం అక్ర‌మ రవాణా చేస్తూనే ఉన్నారు. తాజాగా బంగారాన్ని అక్ర‌మంగా త‌ర‌లిస్తూ చెన్నై అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ఇద్ద‌రు ప్ర‌యాణికులు ప‌ట్టుబ‌డ్డారు. న‌డ‌క అనుమాస్ప‌దంగా క‌నిపించ‌డంతో త‌నిఖీ చేసిన అధికారుల‌కు ఆ ఇద్ద‌రి నుంచి 937 గ్రాముల బంగారం ప‌ట్టుబ‌డింది. పేస్టు రూపంలో ఉన్న బంగారాన్ని ర‌బ్బ‌ర్ ట్యూబ్‌ల‌లో నింపి పాయు రంధ్రాల్లో దాచుకున్న‌ట్లు గుర్తించి వెలికి  తీయించారు. అదేవిధంగా లోదుస్తుల్లో దాచిన బంగారం పొడి ప్యాకెట్ల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. హ్యాండ్ బ్యాగ్‌ల‌లో దాచిపెట్టిన చిన్న‌చిన్న బంగారం ముక్క‌ల‌ను కూడా రిక‌వ‌రీ చేశారు. మొత్తం బంగారం బ‌రువు 937 గ్రాములు ఉన్న‌దని, దాని విలువ రూ.48.27 ల‌క్ష‌లు ఉంటుంద‌ని అధికారులు తెలిపారు.           

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo