శుక్రవారం 27 నవంబర్ 2020
Crime - Oct 31, 2020 , 17:54:24

90 ఏండ్ల వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం!

90 ఏండ్ల వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం!

అగ‌ర్త‌లా: త‌్రిపుర‌లో దారుణం జ‌రిగింది. 90 ఏండ్ల వృద్ధురాలిపై ఇద్ద‌రు వ్య‌క్తులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. త్రిపుర రాష్ట్రంలోని నార్త్ త్రిపుర జిల్లా కంచ‌న్‌పూర్ స‌బ్‌డివిజ‌న్‌లోగ‌ల బ‌ర్హ‌ల్ది గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. బ‌ర్హ‌ల్ది గ్రామానికి చెందిన 90 ఏండ్ల వృద్ధురాలు త‌న ఇంట్లో ఒంట‌రిగా నివాసం ఉంటున్న‌ది. ఇంటి ఎదురుగా ఉండే వ్య‌క్తి ఆమెతో స‌న్నిహితంగా ఉంటూ అమ్మ‌మ్మా అని పిలుస్తుండేవాడు. అదే చ‌నువుతో ఈ నెల 24న ఎదురింటి వ్య‌క్తి త‌న స్నేహితుడితో క‌లిసి వృద్ధురాలి ఇంట్లో చొర‌బ‌డ్డాడు. 

అనంత‌రం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అయితే, ప‌రువు పోతుంద‌న్న భ‌యంతో వృద్ధురాలు ఈ విష‌యాన్ని ఎవ‌రికీ చెప్పుకోలేదు. కానీ తీవ్ర అనారోగ్యానికి గురైంది. దాంతో బంధ‌వులు ఆమెను ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వృద్ధురాలిపై అత్యాచారం జ‌రిగిన విష‌యం వెలుగుచూడటంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు వృద్ధురాలికి ప‌రీక్ష‌లు చేయించి, వాంగ్మూలం తీసుకున్నారు. ప‌రారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేప‌ట్టారు.        

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.