శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Crime - Jan 23, 2021 , 18:32:15

పాయువుల్లో బంగారం.. ప‌ట్టుబ‌డ్డ 9 మంది ప్ర‌యాణికులు

పాయువుల్లో బంగారం.. ప‌ట్టుబ‌డ్డ 9 మంది ప్ర‌యాణికులు

చెన్నై: అధికారులకు ఎన్నిసార్లు ప‌ట్టుబ‌డ్డా బ‌ంగారం స్మ‌గ్లింగ్ దందాకు మాత్రం బ్రేకులు ప‌డ‌టంలేదు. ప్ర‌తిరోజూ దేశంలో ఎక్క‌డో ఒక‌చోట బంగారం స్మ‌గ్ల‌ర్లు ప‌ట్టుబ‌డుతూనే ఉన్నారు. తాజాగా త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నై విమానాశ్ర‌యంలో అక్ర‌మంగా బంగారాన్ని త‌ర‌లిస్తూ 9 మంది ప‌ట్టుబ‌డ్డారు. న‌డ‌క తీరును అనుమానించి అధికారులు త‌నిఖీ చేయ‌గా తొమ్మిది మంది పాయువుల్లో బంగారం ఉన్న‌ట్లు బ‌య‌ట‌ప‌డింది. 

దాంతో అధికారులు వారిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని రిక‌వ‌రీ చేశారు. మొత్తం 48 చిన్నచిన్న బండిళ్ల‌లో మొత్తం 7.72 కిలో బంగారం దొరికింది. మ‌రో 386 గ్రాముల బంగారం ముక్క‌లు, 74 గ్రాముల బ‌రువున్న ఒక బంగారు గొలుసును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 8.18 గ్రాముల బ‌రువున్న ఈ బంగారం విలువ రూ.4.16 కోట్లు ఉంటుంద‌ని అధికారులు తెలిపారు.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo