గురువారం 03 డిసెంబర్ 2020
Crime - Oct 27, 2020 , 19:32:53

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్ప‌డిన 9 మంది అరెస్టు

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్ప‌డిన 9 మంది అరెస్టు

ఖమ్మం : క‌్రికెట్ బెట్టింగ్‌కు పాల్ప‌డిన తొమ్మిది మంది వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మంలో మంగ‌ళ‌వారం చోటుచేసుకుంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు ఖ‌మ్మం టాస్క్‌ఫోర్స్ సిబ్బంది టేకుల‌ప‌ల్లి వెంత‌న స‌మీపంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్ప‌డుతున్న స్థావ‌రంపై రైడ్ చేశారు. ఈ సంద‌ర్భంగా 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వ‌ద్ద నుంచి రూ. 50 వేల న‌గ‌దు, 9 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్న‌ట్లు ఏసీపీ వెంక‌ట్రావు తెలిపారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఈ బ్యాచ్‌ ఇప్ప‌టివ‌ర‌కు రూ. 4,78,450 వ‌ర‌కు బెట్టింగ్‌కు పాల్ప‌డిన‌ట్లుగా విచార‌ణ‌లో తేలింద‌న్నారు.