శనివారం 27 ఫిబ్రవరి 2021
Crime - Jan 24, 2021 , 19:39:23

ప‌సిడి స్మ‌గ్లింగ్‌: ‌చెన్నైలో తొమ్మిది మంది అరెస్ట్‌

ప‌సిడి స్మ‌గ్లింగ్‌: ‌చెన్నైలో తొమ్మిది మంది అరెస్ట్‌

న్యూఢిల్లీ: గ‌త మూడు రోజుల్లో దుబాయి, షార్జా నుంచి అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న 9 కిలోల‌కు పైగా బంగారాన్ని చెన్నై విమానాశ్ర‌యంలోని క‌స్ట‌మ్స్ అధికారులు జ‌ప్తు చేశారు. దీనికి సంబంధించి ఒక మ‌హిళ‌తోపాటు తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన‌ట్లు తెలిపారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం మేర‌కు చెన్నై అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో శుక్ర‌వారం క‌స్ట‌మ్స్ అధికారులు నిఘా పెట్టారు. దుబాయి నుంచి వ‌చ్చిన న‌లుగురు మ‌హిళ‌ల‌తోపాటు 17 మందిని త‌నిఖీ చేశారు.

వారి నుంచి 9.03 కిలోల బ‌రువు గ‌ల 48 బండిళ్ల గోల్డ్ పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మ‌రోసారి త‌నిఖీ చేయ‌డంతో వివిధ ప్యాంట్ ప్యాకెట్లు, హ్యాండ్ బ్యాగుల్లో 74 గ్రాముల బ‌రువు గ‌ల 12 గోల్డ్ క‌ట్ బిట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం షార్జా నుంచి ఇండిగో ప్లైట్‌లో వ‌చ్చిన రామ‌నాథ‌పురం జిల్లా వాసి క‌లంద‌ర్ ఇలియాస్‌ను అరెస్ట్ చేసిన‌ట్లు క‌స్ట‌మ్స్ అధికారులు తెలిపారు. అత‌డి వ‌ద్ద 310 గ్రాముల గోల్డ్ పేస్ట్‌కు సంబంధించిన మూడు బండిళ్లు బ‌య‌ట ప‌డ్డాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo