శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Jun 21, 2020 , 14:35:48

దొంగ‌త‌నం కోసం వృద్ధుడిని క‌ట్టేసి.. భార్య‌ను చంపేశారు..

దొంగ‌త‌నం కోసం వృద్ధుడిని క‌ట్టేసి.. భార్య‌ను చంపేశారు..

న్యూఢిల్లీ : ఢిల్లీలోని స‌ఫ్ద‌ర్ జంగ్ ఎన్ క్లేవ్ లో శ‌నివారం రాత్రి దారుణం జ‌రిగింది. ఓ 88 ఏళ్ల వృద్ధురాలిని గుర్తు తెలియ‌ని దుండ‌గులు హ‌త్య చేశారు. ఆమె భ‌ర్త‌(94)ను తాళ్ల‌తో క‌ట్టేసి ఈ దారుణానికి పాల్ప‌డ్డారు. 

కాంతా  చావ్లా(88) అనే వృద్ధురాలు త‌న భ‌ర్త‌తో క‌లిసి నాలుగు అంత‌స్తుల భ‌వ‌నంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో నివాసం ఉంటున్నారు. వీరి ఇంట్లో ఓ ప‌ని మ‌నిషి ప‌ని చేస్తోంది. అంతే కాకుండా రాత్రి స‌మ‌యాల్లో వృద్ధ దంప‌తుల‌కు ర‌క్ష‌ణ‌గా.. ఓ కాప‌లాదారున్ని నియ‌మించుకున్నారు. అయితే‌ శ‌నివారం రాత్రి 8:30 గంట‌ల స‌మ‌యంలో ఓ ముగ్గురు వ్య‌క్తులు.. ఆ ఇంట్లోకి ప్ర‌వేశించారు. దుండ‌గులు ఇంట్లోకి వ‌చ్చిన స‌మ‌యంలో కాప‌లాదారుడు అక్క‌డ లేడు. 

ఈ ముగ్గురు దొంగ‌త‌నం కోసం ఇంట్లోకి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ముస‌లావిడ అరిచి అంద‌రిని అప్ర‌మ‌త్తం చేసే అవ‌కాశం ఉంద‌ని భావించి.. ఆమెను మొద‌ట చంపేశారు. వృద్ధుడిని తాళ్ల‌తో క‌ట్టేసి బంధించారు. రాత్రి 9:30 గంట‌ల స‌మ‌యంలో వృద్ధుడు మెల్ల‌గా బ‌య‌ట‌కు వ‌చ్చి పొరుగు వారిని అప్ర‌మ‌త్తం చేశాడు. దీంతో వారు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. 

పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇంటిని క్షుణ్ణంగా ప‌రిశీలించారు పోలీసులు. అక్క‌డున్న సీసీటీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలించి.. ఇంట్లోకి ముగ్గురు వ‌చ్చిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ఇందులో కాప‌లాదారుడు ఉన్నాడా? లేదా అన్న‌ది తేలాల్సి ఉంది. 


logo