ఆదివారం 17 జనవరి 2021
Crime - Oct 02, 2020 , 08:59:49

పంజాబ్‌లో 8 ఏండ్ల బాలికపై లైంగికదాడి

పంజాబ్‌లో 8 ఏండ్ల బాలికపై లైంగికదాడి

లూధియానా : పంజాబ్‌లోని లూధియానా నగరంలో దారుణం జరిగింది. 8 ఏండ్ల బాలికపై యువకుడు అమానుషంగా ప్రవర్తించాడు. చాకెట్లు ఆశచూపి ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని సిద్దార్థ నగర్‌కు చెందిన విశ్వకర్మ (25) అనే యువకుడు లూధియానాకు వలస వచ్చి కొంతకాలంగా సబ్జీమండి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. తన ఇంటికి పొరుగునే ఉన్న 8 ఏండ్ల బాలికపై అతడి కన్నుపడింది.

గురువారం బాలికకు చాకెట్లతోపాటు రూ.50 ఆశచూపి తన గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కూతురును వెతుకుతూ తల్లి వెళ్లగా గదిలో నగ్నంగా ఉన్న యువకుడు ఆమెను నెట్టేసి పరారయ్యాడు. బాలికకు తీవ్రరక్తస్రావం అవుతుండటంతో దవాఖానకు తరలించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ 342, 376 సెక్షన్లతోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు లూధియానా ఏసీపీ గుర్బీందర్‌ సింగ్‌ తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.