శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jul 07, 2020 , 12:22:39

బాంబును కొరికిన బాలుడు.. ద‌వ‌డ‌కు తీవ్ర గాయం

బాంబును కొరికిన బాలుడు.. ద‌వ‌డ‌కు తీవ్ర గాయం

చెన్నై : ఆహారం ప‌దార్థం అనుకుని ఓ నాటు బాంబును బాలుడు కొర‌క‌డంతో.. అది పేలింది. దీంతో బాలుడి ద‌వ‌డతో పాటు కుడి చేయికి తీవ్ర గాయ‌మైంది. ఈ ఘ‌ట‌న తమిళ‌నాడులోని చెంగం స‌మీపంలోని క‌రైమంగ‌ళం గ్రామంలో చోటు చేసుకుంది. 

మూడో త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఎనిమిదేళ్ల బాలుడికి ఓ నాటు బాంబు దొరికింది. దాన్ని ఆహార ప‌దార్థంగా భావించిన బాలుడు.. ఒక్క‌సారి కొరికాడు. దీంతో అదినోట్లో పేలి.. భారీ శ‌బ్దం వ‌చ్చింది. బాధితుడి ద‌వ‌డ ప‌గిలిపోయింది. కుడి చేయికి తీవ్ర గాయ‌మైంది. బాధిత బాలుడిని దీపక్ గా పోలీసులు గ‌ర్తించారు. ఈ స‌మ‌యంలో దీప‌క్ ప‌క్క‌నే అత‌ని స్నేహితుడు మ‌ణికంద‌న్ ఉన్నాడు. 

దీంతో మ‌ణికంద‌న్ అప్ర‌మ‌త్త‌మై స్థానికుల‌కు స‌మాచారం అందించాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ్నుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని గ‌వ‌ర్న‌మెంట్ స్టాన్లీ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. ప్ర‌స్తుతం బాధిత బాలుడి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. 

ఈ సంద‌ర్భంగా చెంగం పోలీసు స్టేష‌న్ ఎస్ఐ సోలోమాన్ రాజా మాట్లాడుతూ.. కొంద‌రు వేట‌గాళ్లు అడ‌వి పందుల కోసం అట‌వీ ప్రాంతాల గ్రామాల్లో నాటు బాంబులు అమ‌ర్చార‌ని తెలిపారు. అలా ప‌డేసిన బాంబుల‌ను పిల్ల‌లు కొర‌క‌డం వ‌ల్ల ప్ర‌మాదం సంభ‌వించిన‌ట్లు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు ఎస్ఐ తెలిపారు. 


logo